English | Telugu

వేర్ ఈజ్ ఎన్టీఆర్ 

-ఎన్టీఆర్ కి అభిమానుల విన్నపం
-సోషల్ మీడియా వేదికగా హంగామా
-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు
-రిషబ్ శెట్టి ఉన్నాడా!

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి ఉన్న అభిమానగణం అపారం. సుమారు రెండు దశాబ్దాలపై నుంచి ఎన్టీఆర్ కి అభిమానులకి మధ్య అభిమానం కొనసాగుతు వస్తుంది. పైగా ఆ అభిమాన గణం సినిమా సినిమాకి రెట్టింపు అవుతు ఉంది. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2(War 2)తో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత హైబడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా కూడా నిర్మాణం జరుపుకుంటుంది. కథ, కథనాలు కూడా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ గత చిత్రాలని మించి ఉండబోతున్నాయి .దీన్ని బట్టి ఈ మూవీ కోసం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అంతే అంచనాలతో మూవీ అప్ డేట్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎదురుచూస్తు వస్తున్నారు. ఎందుకంటే సదరు అప్ డేట్స్ చూసి సినిమా రిలీజ్ రోజుఎంతగా ఆనందం పొందుతారో, సోషల్ మీడియాలో వచ్చే అప్ డేట్ చూసి అంతే ఆనందం పొందుతారు. సదరు అప్ డేట్స్ ని వేరే వాళ్ళతో కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకే అభిమానులు దేవుళ్లతో సమానం అని అంటుంటారు. కానీ గత కొన్ని రోజుల నుంచి మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఎన్టీఆర్ నీల్ ల ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలని, వేరే క్యారెక్టర్స్ పై షూటింగ్ జరిగినా కూడా అప్ డేట్స్ ఇస్తుండాలని కోరుతున్నారు. సినిమాకి ఇప్పట్నుంచే పబ్లిసిటీ ఉండాలనే సలహా కూడా ఇస్తున్నారు.

also read :నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది


ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. డ్యూయల్ రోల్ అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఎన్టీఆర్ సరసన 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)జత కడుతుంది.ఈ మేరకు మేకర్స్ రుక్మిణి పేరుని అధికారకంగా ప్రకటించడమే తరువాయి. కాంతార చాప్టర్ 1(Kantara chapter 1) తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టించిన రిషబ్ శెట్టి(Rishab Shetty)కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే మరో రూమర్ కూడా వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.