English | Telugu

ప్రీ రిలీజ్ బిజినెస్ లో జననాయగన్ రికార్డు

సిల్వర్ స్క్రీన్ కోసం, అభిమానుల కోసం, పాన్ ఇండియాప్రేక్షకులని రంజిప చెయ్యడం కోసం కొంత మంది స్టార్ హీరోలు ఈ భూమ్మీదకి వస్తారు. అటువంటి ఒక అరుదైన సూపర్ స్టార్ 'దళపతి విజయ్'(Vijay). తన సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నిత్యం విజయ్ కి సంబంధించిన సినిమాల గురించి గూగుల్ లో సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం 'జననాయగన్' అనే మూవీ చేస్తున్నాడు. తెలుగులో 'జననాయకుడు'పేరుతో రిలీజ్ కానుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంతో పాటు జననాయగన్ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తో మూవీలో పొలిటికల్ సువాసనలు తారాస్థాయిలోనే ఉండనునున్నాయనే విషయం అర్ధమవుతుంది.