English | Telugu

నిఖిల్ హ్యాపీ... ఎందుకు?

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ ‘‘హ్యాపీడేస్’ చిత్రంతో ప్రారంభమైన నా కెరీర్‌కు ‘స్వామి రారా’ చిత్రం కమర్షియల్ బ్రేక్ నచ్చింది. ఆ తర్వాత ‘కార్తికేయ’ ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాను. హీరోగా భవిష్యత్‌లో ఎన్ని సినిమాలు చేసిన వరుసగా వచ్చిన ఈ హిట్స్‌ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు విజయాల్ని అందించిపెట్టిన