English | Telugu

నిఖిల్ హ్యాపీ... ఎందుకు?

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ ‘‘హ్యాపీడేస్’ చిత్రంతో ప్రారంభమైన నా కెరీర్‌కు ‘స్వామి రారా’ చిత్రం కమర్షియల్ బ్రేక్ నచ్చింది. ఆ తర్వాత ‘కార్తికేయ’ ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాను. హీరోగా భవిష్యత్‌లో ఎన్ని సినిమాలు చేసిన వరుసగా వచ్చిన ఈ హిట్స్‌ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు విజయాల్ని అందించిపెట్టిన దర్శకనిర్మాతలకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని అన్నారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడ్డాడు. నిర్మాణ బాధ్యతలతో పాటు ప్రమోషన్ విషయంలో చాలా శ్రద్ధ వహించాడు. నిఖిల్ నిర్మాతల కథానాయకుడు. అతనితో సినిమా చేయడానికి నేను ఎప్పుడైనా సిద్దమే. మా సినిమా విడుదలై 25 రోజులు పూర్తయిన చక్కటి వసూళ్లను సాధిస్తోంది’ అని తెలిపారు.

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘‘స్వామిరారా’ చిత్రాన్ని ప్రారంభిస్తున్నపుడు మా సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. నేను చెప్పిన కథను నమ్మి నిఖిల్, నిర్మాత చక్రి ఆ చిత్రానికి అంగీకారం తెలిపారు. సినిమా పెద్ద విజయాన్ని సాధించటానికి వారు అందించిన ప్రోత్సాహమే కారణం. నిఖిల్ హ్యాట్రిక్ హిట్‌ను అందుకోవటం ఆనందంగా ఉంది. అతను మరిన్ని పెద్ద విజయాల్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

నిఖిల్ ఓకే అంటే అతనితో కార్తికేయ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నానని దర్శకుడు చందు మొండేటి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చైతన్యకృష్ణ, చక్రి చిగురుపాటి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వైవా హర్ష, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.