English | Telugu

స‌రికొత్త అవ‌తారంలో మంచు ల‌క్ష్మి

మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మ‌ల్టీ టాలెంటెడ్ అన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. న‌టిగా, నిర్మాత‌గా, టీవీ షో వ్యాఖ్యాత‌గా త‌న‌కంటూ ఓ సెప‌రేట్ బ్రాండ్ సృష్టించుకొంది. 'మా' ఉపాధ్య‌క్షురాలిగానూ ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌బోతోంది. తాజాగా ఇప్పుడు మ‌రో అవ‌తారం ఎత్తింది. గాయ‌నిగా ఆమె త‌న టాలెంట్ చూపించ‌బోతోంది. మంచు ల‌క్ష్మి న‌టిస్తూ, నిర్మించిన చిత్రం 'దొంగాట‌'. ఇందులో మంచు ల‌క్ష్మి పాట పాడింద‌ట‌. ఆమెతో పాటు... అడ‌వి శేష్ కూడా గొంతుక‌లిపాడ‌ట‌. 'దొంగాట‌' ప్ర‌మోష‌న్స్ కోసం ఈ పాట‌ని రూపొందించార‌ని తెలుస్తోంది. న‌ట‌న‌, నిర్మాణం, గానం, వ్యాఖ్యానం.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం వైపు కూడా అడుగులేస్తుందేమో.. చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.