English | Telugu

ఏప్రిల్‌ 24న ‘దోచేయ్‌’

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచేయ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌ 24న సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ కాబోతోంది.


ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్‌తో మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘దోచేయ్‌’ చిత్రాన్ని ఏప్రిల్‌ 24న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ రెండోవారంలో లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 1 వరకు రోజుకొకటి చొప్పున విడుదల చేసిన సాంగ్స్‌కి, టీజర్స్‌కి చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా, మా బేనర్‌ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘దోచేయ్‌’ నిలుస్తుంది’’ అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.