Brahmamudi : భార్య సీఈఓ.. భర్త ఎంప్లాయ్.. ఇదెక్కడి మాస్ రా మామ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -545 లో.....అందరు ఇంటికి వచ్చాక ఎందుకు అలా చేసావంటూ రాజ్ ని అపర్ణ, ఇందిరాదేవిలు తిడతారు. మీరు నన్ను అనే హక్కుని కోల్పోయారు. వాళ్ళతో కలిసి నాటకం ఆడి నన్ను మోసం చేశారు. ఇలాంటి ప్రయత్నం చెయ్యకండి.. నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు.