English | Telugu

సవతి తల్లి గురించి తెలుసుకున్న కొడుకు.. ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -287 లో......సీతాకాంత్ మేనేజర్ ని పిలిచి పెద్దాయనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత సందీప్ పెద్దాయన దగ్గరికి వచ్చేసరికి లేకపోవడంతో టెన్షన్ గా శ్రీలత వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను లేడని చెప్పడంతో అందరు కంగారుపడతారు. ఎక్కడ వాళ్ళ గురించి పెద్దాయన చెప్తాడోనని టెన్షన్ పడతారు. అపుడే సిరి వచ్చి.. ఏంటి అండి వచ్చినప్పటి నుండి మా వాళ్ళతో అంత చనువుగా ఉంటున్నారని ధనతో సిరి అంటుంది.

మీ అమ్మ చాలా మంచిదని ధన అంటాడు. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. ఎక్కడికి వెళ్లారు తాతయ్య కూడా కన్పించడం లేదని సిరి అంటుంది. తాతయ్య ఆఫీస్ నుండి కాల్ వస్తే వెళ్లారని సందీప్ అనగానే.. ఎంత ఈజీ గా అబద్ధం ఆడుతున్నావని సీతాకాంత్ అనుకుంటాడు. నువ్వు ఏంటి అన్నయ్య అలా ఉన్నావని సిరి అడుగగా.. మీ అన్నయ్యని ఈ ల్యాండ్ ఓనర్స్ కొట్టారు. నేను టైమ్ కి వెళ్లను కాబట్టి సరిపోయిందని రామలక్ష్మి అనగానే.. అయ్యో ఏమైంది నాన్న అంటూ శ్రీలత నటిస్తుంటుంది. నువ్వు చేసిన గాయం ముందు ఇది ఎంత అని సీతాకాంత్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత కేక్ కట్ చేస్తుంది. మొదటగా సీతాకాంత్ కి తినిపిస్తుంది. అప్పుడే మేనేజర్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. ఆ డాకుమెంట్స్ పైన సీతాకాంత్, రామలక్ష్మి లు సంతకం పెడతారు. సీతాకాంత్ తన ఆస్తులు అన్ని కూడా సగం సిరికి సగం సందీప్ కి ఇస్తున్నట్లు ఉంటుంది. ఇక ఆస్తులు అన్ని మీవే అని సీతాకాంత్, శ్రీలతకి డాక్యుమెంట్స్ ఇస్తాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లి, ధనలు హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఆ తర్వాత ఏమైందని సీతాకాంత్ ని అడుగుతుంది రామలక్ష్మి.. కానీ‌ అతను సమాధానం చెప్పడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు ఇంటికి వచ్చి తమ బ్యాగ్ ని సర్దుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనవసరంగా సీతా బావ రామలక్ష్మిలని చంపాలనుకున్నామని ధన అంటాడు. ఆ మాటలు సిరి విని మా అన్నయ్యని చంపాలనుకున్నారా అని అడుగుతుంది. అవునంటూ సందీప్ కఠినంగా మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ రామలక్ష్మి, సీతాకాంత్ లు వింటారు. వాళ్ళ గురించి నిజం తెలిసి నా దగ్గర దాచారా అని సీతాకాంత్ ని రామలక్ష్మి అడుగుతుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి ధన చెంప పగులగొడుతుంది. వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తుంది మీరేనా అని రామలక్ష్మి అనగానే.. అవునని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.