English | Telugu

గుండెల్ని పిండేసిన అత్తాకోడళ్లు.. తను ఆ వ్రతం జరగనిస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -37 లో... భద్రవతికి రామరాజు సారీ చెప్పినందుకు బాధపడుతుంటే వేదవతి వస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుంది అసలు నువ్వు ముగ్గు వేయకుండా ఆ పిల్ల ఎందుకు వేసిందని భద్రావతి పైన కోప్పడతాడు రామరాజు. ఇక ఇంట్లో ఏ గొడవ జరగకుండా చూడు.. అన్ని నువ్వు చూసుకో అని వేదవతికి చెప్తాడు. దాంతో కోపంగా నర్మద దగ్గరికి వెళ్తుంది వేదవతి. నర్మద కూడా వేదవతి కోసం వస్తుంటుంది.

నీ వల్లే ఈ గొడవలు.. నీకు ఇవన్నీ పనులు చెయ్యమని నేను చెప్పానా.. ఎందుకు అన్నింట్లో పెద్దరికం చేస్తున్నావని నర్మదపైన కోప్పడుతుంది వేదవతి. దాంతో వేదవతిని నర్మద హగ్ చేసుకొని.. మీరు చాలా గ్రేట్ అత్తయ్య మా అమ్మనాన్నలకి దూరంగా ఉండి రెండు రోజులు అవుతుంది.. నాకే ఏదోలా బాధగా ఉంది కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళకి దూరంగా ఉంటూ ఎంత బాధని అనుభవిస్తున్నారని నర్మద ఎమోషనల్ అవుతుంది. దంతో వేదవతి అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఆ తర్వాత వేదవతి గుడికి వెళ్తుంది. అక్కడ కొంతమంది వేదవతి తన కొడుకు కోడలు చేత సత్యనారాయణ వ్రతం చేయించలేదంటూ మాట్లాడుకుంటారు. అది విని రామరాజుకి చెప్పి పూజ జరిపిద్దామని తనే అనేలా చేస్తుంది వేదవతి. అది చూసి చూసావా వదిన మా అమ్మ పూజ జరిపించడానికి ఎలా నరక్కుంటూ వస్తుందోనని నర్మదతో ధీరజ్ అంటాడు.

ఆ తర్వాత నర్మద, ధీరజ్ లు పూజకి కావలిసినవి కొనడానికి వస్తారు. అక్కడికి ప్రేమ వస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే ధీరజ్, ప్రేమలకి గొడవ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ మా ఇంట్లో పూజ ఉంది రావాలనంటుంది. ఆ మాటలు తన అన్న విశ్వ విని దగ్గరికి వచ్చి నర్మద పైన కోప్పడి.. ప్రేమని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత విశ్వ ఇంటికి వెళ్లి.. ఆ నర్మద మన ప్రేమతో పూజకి రమ్మని చెప్తుందని భద్రవతికి చెప్తాడు. ఆ పూజ ఎలాగైనా ఆపాలని భద్రవతి అంటుంది. ఎలా అని విశ్వ అనగానే.. నేను చూసుకుంటానని ప్రసాదరావుకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది భద్రవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.