English | Telugu
పది లక్షలున్నాయ్.. నీకు కావాలంటే క్షమాపణలు చెప్పాల్సిందే!
Updated : Dec 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -236 లో.....కార్తీక్ అందరిని లోపలికి పంపించి ఓనర్ తో ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం కష్టం.. ఈ ఫోన్ ఉంచండి.. డబ్బులు ఇచ్చి తీసుకుంటానని కార్తీక్ అనగానే సరే కానీ రెంట్ మాత్రం కరెక్ట్ టైమ్ కి ఇవ్వాలి అంటాడు. దానికి కార్తీక్ సరే అంటాడు. అదంతా దీప చూసి గతంలో తను హెల్ప్ చేసినప్పటి విషయం గుర్తుచేసుకొని ఎలా ఉండేవాళ్లు ఎలా అయ్యారనుకుంటుంది.
కార్తీక్ ఓనర్ తో మాట్లాడి వస్తుంటే వెనకాల దీప ఉంటుంది. కార్తీక్ కవర్ చేస్తూ.. ఈ ఇల్లు బాగుంది కదా అంటూ కవర్ చేస్తాడు. అప్పుడే శౌర్య వచ్చి.. నాన్న నాకు ఈ ఇల్లు నచ్చలేదని అంటుంది. ఎందుకు అమ్మ, నాన్నకి నచ్చినప్పుడు.. నీకు నచ్చకుంటే నాన్న బాధపడుతాడు కదా అని కార్తీక్ అంటాడు. నాకు నచ్చింది నాన్న అని శౌర్య అంటుంది. ఆ తర్వాత నాకు ఆకలిగా ఉంది. నాన్న అమ్మ ఏదైనా పెట్టు అని శౌర్య అనగానే.. బయటకు వెళ్లి తిందామని దీప, శౌర్యలని బయటకు తీసుకొని వెళ్తాడు కార్తీక్. చిన్న బండి దగ్గరికి తీసుకొని వెళ్లి టిఫిన్ తీసుకుంటాడు. డబ్బులు తక్కువ ఉంటాయి. అయిన హోటల్ అతను ఇస్తాడు.
ఆ తర్వాత నాన్న అది కూడా తింటా ఆకలిగా ఉందని శౌర్య అనడంతో.. కార్తీక్ ప్లేట్ శౌర్య తీసుకుంటుంది. కార్తీక్ వెళ్లి వాటర్ తాగుతుంటే.. దీప వెళ్లి తన ప్లేట్ లో ఉన్నవి ఇస్తుంది. ఇద్దరు షేర్ చేసుకొని తింటారు. మరొకవైపు కాంచన, అనసూయ ఇల్లు క్లీన్ చేస్తుంటే శ్రీధర్, కావేరిలు వస్తారు. కావేరి కార్తీక్ రెస్టారెంట్ కి డబ్బులు ఇవ్వగా.. వద్దని కాంచన కోప్పడుతుంది. ఈ పరిస్థితి వచ్చినందుకు కాంచనతో వెటకారం గా మాట్లాడతాడు శ్రీధర్. అప్పుడే కార్తీక్ వాళ్లు వస్తారు. రెస్టారెంట్ పెట్టడానికి నా దగ్గరున్న డబ్బు ఇస్తాను కానీ కొన్ని షరతులు అని శ్రీధర్ చెప్తుంటాడు. నన్ను అవమానించినందుకు నాకు సారీ చెప్పాలి. ఇంకొకటి మీతో నన్ను ఉండనివ్వలని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.