హీరోయిన్స్ ని మాత్రమే అడుగుతారు.. వాళ్ళకి అది కావాలిగా
మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన' అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)2016లో 'నాగచైతన్య'(Naga Chaitanya)హిట్ మూవీ 'ప్రేమమ్' ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారింది. ఎలాంటి సబ్జెట్ లో చేసినా, తన క్యారక్టర్ పరిధి మేరకు అద్భుతంగా నటించగలదు. ప్రేక్షకుల్లో మన పక్కింటి అమ్మాయి, సదరు క్యారక్టర్ లో చేస్తుందా అని అనిపించడం అనుపమ నటన స్పెషాలిటీ. ఎక్కువగా క్లీన్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో నటించే అనుపమ గత ఏడాది రొమాంటిక్, క్రైమ్ కామెడీ 'టిల్లుస్క్వేర్' చేయడం పెద్ద సంచలనం సృష్టించింది.