English | Telugu

హీరోయిన్ గా కృష్ణ మనవరాలు!.. హీరో ఇతనే అనేది నిజమా! 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్ కృష్ణ'(Krishna)సినీప్రస్థానానికి ఉన్న 'చరిష్మా' గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్నో సాహసాలతో తెలుగు సినిమాని వేగంతో పరుగెత్తించి, కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించాడు. ప్రపంచ సినీ చరిత్రలో 320 కి పైగా సినిమాల్లో హీరోగా చేసిన రికార్డు 'కృష్ణ' సొంతం. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ రికార్డుని ఇంకో హీరో టచ్ అవకాశాలు లేవు.

సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా 'కృష్ణ' పెద్దకుమారుడు 'రమేష్ బాబు'(Ramesh Babu)కుమార్తె 'భారతి'(Bharathi)హీరోయిన్ గా పరిచయం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు 'భారతి' ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సదరు చిత్రంలో ప్రముఖ దర్శకుడు 'తేజ' కుమారుడు 'అమితవ్‌'(Amitov)హీరోగా చేస్తున్నాడని, తేజ(Teja)దర్శకత్వంలోనే 'ప్రేమకథ'గా తెరకెక్కబోతుందనే న్యూస్ కూడా వినపడుతుంది. 'అభినవ్' హీరోగా 'విక్రమాదిత్య' టైటిల్ తో తేజ ఒక ప్రాజెక్ట్ కి సన్నాహాలు మొదలుపెట్టాడనే వార్తలు మాత్రం కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి.

ఇక రమేష్ బాబు కుమారుడు 'జయకృష్ణ' హీరోగా పరిచయం కాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జయకృష్ణ సోదరి 'భారతి' సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన న్యూస్ ఆసక్తికరంగా మారింది. భారతి తండ్రి రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో చేసి, అభిమానులతో పాటు ప్రేక్షకులని మెప్పించాడు. నిర్మాతగాను సోదరుడు మహేష్ బాబు(Mahesh Babu)తో 'అర్జున్' వంటి హిట్ మూవీని నిర్మించాడు. గతంలో కృష్ణ కూతురు 'మంజుల'(Manjula Ghattamaneni)హీరోయిన్ గా పరిచయం కాబోతుందని ప్రకటన వస్తే అభిమానులు,ఆ ప్రకటన వెనక్కి తీసుకునే దాకా ఆందోళన చేసారు. దీంతో మంజులని కృష్ణ హీరోయిన్ గా పరిచయం చెయ్యలేదు. భారతి సినీ రంగ ప్రవేశానికి సంబంధించి వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు నెటిజన్స్ గతంలో జరిగిన మంజుల సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.