English | Telugu

మెగా ట్రీట్.. 'ఓజీ' లాంటి సినిమాలో చిరంజీవి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'ఓజీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'ఓజీ' చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్టార్డంకి తగ్గట్టుగా ఈ తరహా గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ చేస్తే చూడాలని వారు ఆశపడుతున్నారు. అయితే త్వరలోనే మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరేలా ఉంది.

చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇవి కాకుండా బాబీ కొల్లి డైరెక్షన్ లో కూడా ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. ఆ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచాడు బాబీ. అందులో చిరంజీవి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే భారీ వసూళ్లతో 'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించింది.

అయితే ఈసారి బాబీ 'వాల్తేరు వీరయ్య' తరహా ఎంటర్టైనర్ లా కాకుండా.. భారీ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉంటాయట. చిరంజీవి నుంచి 'ఓజీ', 'విక్రమ్', 'జైలర్' తరహా సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మెగా ఫ్యాన్స్ మెచ్చే సినిమాని రూపొందే పనిలో ప్రస్తుతం బాబీ ఉన్నట్లు సమాచారం.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం