అనుష్క కోసం రంగంలోకి ప్రభాస్.. నేను ఊరుకోనంటున్నప్రముఖ నటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),అనుష్క(Anushka)ఫెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. మిర్చి, బాహుబలి సిరీస్ సక్సెస్ లే అందుకు ఉదాహరణ. సినిమాల పరంగా కాకుండా,వ్యక్తిగతంగా కూడా, ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని ఇద్దరు ఎక్కడ ఖండించలేదు. దీంతో పెళ్లి న్యూస్ పై మరింతగా చర్చ జరుగుతూనే ఉంది.