మైఖేల్ జాక్సన్ బయోపిక్.. డైరెక్టర్ సందీప్ రెడ్డి.. హీరో..?
మైఖేల్ జాక్సన్.. ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సింగర్ గా, డ్యాన్సర్ గా ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మైఖేల్ జాక్సన్ జీవితంలో విజయాలు, విషాదాలు, వివాదాలు ఇలా అన్నీ ఉన్నాయి.