యాక్సిడెంట్ పై స్పందించిన కాజల్.. ఆ వార్త వెనక ఉంది వీళ్లే
తెలుగు సినిమాపై కాజల్ అగర్వాల్(Kajal Aggarwal)ముద్ర చాలా ప్రత్యేకమైనది. గ్లామర్ క్యారెక్టర్స్ పోషించడానికే హీరోయిన్ ఉందనే మాటని చెరిపి వేసిన, అతి తక్కువ మంది హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. తెలుగుతో పాటు ఇతర భాషలకి చెందిన ఎన్నోచిత్రాల్లో అత్యద్భుతంగా నటించి తనకంటు ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంది. చందమామ, మగధీర, బృందావనం, ఆర్య 2 ,గణేష్, నాయక్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, వివేగం, ఖైదీ నెంబర్ 150 , బిజినెస్ మాన్, మెర్సిల్, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది.