English | Telugu

కులాలకి ఆపాదించలేదు.. తెలుగు వారంతా ఒక్కటే

గాడ్ ఆఫ్ మాసెస్ 'పద్మభూషణ్(Padmabhushan)బాలకృష్ణ'(Balakrishna)వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆ మాట కొస్తే ఈ మధ్య కాలంలో 'బాలకృష్ణ'లా వరుస హిట్స్ సాధించిన మరో హీరో లేడంటే అతిశయోక్తి కాదు. పైగా ఇండియాలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో, 50 సంవత్సరాల నుంచి హీరోగా చేస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నిలిచాడు. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు 'అఖండ 2 ' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ కి సీక్వెల్ కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

రీసెంట్ గా బాలకృష్ణ తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తారకరామారావు(Ntr)గారి స్వగ్రామమైన నిమ్మకూరు(Nimmakuru)వెళ్ళాడు. గ్రామంలో ఉన్న తల్లి బసవతారకమ్మ, రామారావు గార్ల విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించాడు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతు చిత్ర పరిశ్రమలోవరుస విజయాలు, పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ఇవన్నీ ప్రజల విజయాలు. పదవులు నాకు ముఖ్యం కాదు. వాటికి నేను అలంకారం. నా విజయలన్ని నా తల్లితండ్రులకి అంకితం. వాళ్ళు లేకపోతే నేను లేను. నటనలో ఎన్టీఆర్ దరిదాపుకి చేరాలన్నదే నా తపన. ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటే. అఖండ 2 ని కులాలకి ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించాం. సోషల్ మీడియా వల్ల ప్రపంచం చాలా చిన్నదైపోయింది. కాబట్టి సోషల్ మీడియాని మంచికి ఉపయోగించండి. చెడుకి వద్దని చెప్పుకొచ్చాడు.

ఇక అఖండ మొదటి భాగంలో అఘోరగా ఉన్న బాలకృష్ణ తన వాళ్ళందర్నీ రక్షించిన తర్వాత, పాపతో, నన్ను నువ్వు పిలవగానే మళ్ళీ వస్తానని అంటాడు. ఈ క్రమంలో పార్ట్ 2 కథపై ఆసక్తి నెలకొని ఉంది. బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ కాగా,బాలకృష చిన్న కూతురు తేజశ్వని(Tejaswini),లెజండ్ ప్రొడ్యూసర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ ని అందిస్తున్న థమన్(Thaman)ఇటివల మాట్లాడుతు అఖండ 2 తో మళ్ళీ శివతాండవం ఖాయమని చెప్పాడు. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.