English | Telugu

చరిత్ర సృష్టించిన ఓజీ.. పవన్ కళ్యాణ్ రికార్డుల వేట షురూ!

'ఓజీ'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డుల వేట మొదలైంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. విడుదలకు మూడు వారాల ముందే.. పవర్ స్టార్ తమ బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా రికార్డులను వేటాడుతున్నారు. (Pawan Kalyan)

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఓజీ మూవీ సంచలనాలు సృషిస్తోంది. ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకుంది. అంతేకాదు, ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. (They Call Him OG)

పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఆయన స్టార్ డమ్ కి తగ్గ సరైన సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని తీర్చేలా ఓజీ వస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే ఓజీ సరికొత్త రికార్డులకు సృష్టిస్తోంది.

ఓజాస్‌ గంభీరగా పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీకి సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటిదాకా ఓజీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానులను ఆకట్టుకుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .