నేడు సిట్ ఎదుటకు కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులనే కాకుండా, బాధితులను కూడా విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకుంటున్న సిట్ అందులో భాగంగానే బండి సంజయ్ కూ నోటీసులు పంపింది.