ఏపీలో అంబులెన్సులకు ఇక కొత్త రూపు, కొత్త రంగులు
ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్సులు ఇక కొత్త రూపంతో కనిపించనున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అంబులెన్సులకు వేసిన నీలం రంగును తొలగించి.. తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో రిఫ్లెక్టివ్ టేపులతో అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించించింది.