పులివెందుల వైసీపీలో భయం.. క్యాడర్ లో అయోమయం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. పులివెందుల పులి.. పులివెందులలో తిరుగే లేదు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఓటమి ఖాయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి.