మహా సాగరంలో అరుదైన ఖనిజాల వేట ముమ్మరం!
మానవుడు తన మనుగడ కోసం, తన అవసరాల, తన స్వార్థం, విలాసవంతమైన సౌకర్యాల కోసం మహా సాగరాలను కూడా చెరబడుతున్నాడు. భూగోళంపై 71శాతం నీరే కాబట్టి భూమి మీద కన్నా సముద్రగర్భంలోనే రెండు రెట్లు అధికంగా ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి, సాంకేతికంగా ముందున్న దేశాలు సముద్ర గర్భం నుంచి అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ పడుతున్నాయి.