బీఆర్ఎస్తో బాల్క సుమన్‌కు రుణం తీరిపోయిందా?
గులాబీ పార్టీలో ముఖ్యనేతలకు అత్యంత వీరవిధేయుడు మాజీ ఎంపీ కమ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. పార్టీలోని ముఖ్య నాయకులలో ఒకరిగా ఎదిగిన దళిత, విద్యార్ధి నాయకుడాయన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తన రాజకీయ గురువు, ఆర్ధికంగా ప్రోత్సహించిన గడ్డం వివేక్‌పై పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు.