English | Telugu
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
Updated : Aug 7, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. వారాంతాలలో అయితే తిరుమల కొండ భక్త జన సముద్రాన్ని తలపిస్తుంటుంది. శుక్రవారం ( ఆగస్టు 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (ఆగస్టు 7) శ్రీవారిని మొత్తం 65 వేల 234 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.