English | Telugu

మీనా రెండో పెళ్లి! క్లారిటీ వచ్చేసింది 

కొంతమంది 'హీరోయిన్లు' సిల్వర్ స్క్రీన్ పై రెగ్యులర్ గా కనిపించకపోయినా, ఆమె సృష్టించిన ప్రభంజనం తాలూకు ప్రభావం ప్రేక్షకుల్లో మెదులుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఒకరు 'మీనా'(Meena). బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన 'మీనా' తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన జత కట్టడంతో పాటు, ఎన్నో చిన్న చిత్రాలు పెద్ద స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారకురాలిగా నిలిచింది. సహజత్వంతో కూడిన నటన మీనా సొంతం. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే 2009 లో బెంగుళూరు కి చెందిన వ్యాపారవేత్త  'విద్యా సాగర్' ని వివాహం చేసుకోగా, అనారోగ్య కారణాలతో 2022 లో ఆయన మరణించడం జరిగింది. వీరిద్దరికి 'నైనికా' అనే పాప ఉంది.

కిష్కింధపురి షాకింగ్ కలెక్షన్స్!.. ఇప్పుడేమంటారో చూడాలి 

భైరవం తర్వాత 'బెల్లంకొండ సాయిశ్రీనివాస్'(Bellamkonda Sai srinivas)నిన్నవరల్డ్ వైడ్ గా 'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)తో కలిసి 'కిష్కింధపురి'(Kishkindhapuri)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్, మిస్టరీ, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad garu)ని నిర్మిస్తున్న 'సాహు గారపాటి' నిర్మించాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ 'కౌశిక్ పెగుళ్ళపాటి'(Koushik pegallapati)దర్శకుడు. ప్రచార చిత్రాల్లో సాయిశ్రీనివాస్ మాట్లాడుతు 'కిష్కిందపురి'థియేటర్లలోకి వెళ్లిన పది నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఫోన్ పట్టుకుంటే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో రిలీజ్ కి ముందే 'సాయిశ్రీనివాస్' అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది.

ఎస్తర్ నొరోన్హా రెండో పెళ్లి? వరుడు అతనేనా!

'ఎస్తర్ నోరోన్హా'(ester Noronha)2019 అక్టోబర్ లో ప్రముఖ సింగర్, నటుడు నోయల్(Noyel)ని వివాహం చేసుకుంది. పట్టుమని పదహారు రోజులు కూడా ఆ ఇద్దరు కలిసి లేరు. దీంతో 2020 లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఎస్తర్ ఒంటరిగానే ఉంటు పలు చిత్రాలతో బిజీగా ఉంటు వస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు నాకు ఒంటరిగా బతకాలని లేదు. అందమైన జీవితం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన  వ్యక్తి కోసం వెతుకుతున్నాను. షోకేస్ లాంటి భర్త మాత్రం వద్దని చెప్పుకొచ్చింది. దీంతో ఎస్తర్ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తు వస్తున్నారు.