English | Telugu

శాకుంతలంకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!

సమంత ప్ర‌ధాన పాత్రలో నటించిన తొలి మైథ‌లాజికల్ మూవీ శాకుంతలం. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీశారు. స్వీయ దర్శకత్వంలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌కుణిగా వ్యవహరిస్తున్నారు. 3d ఐమాక్స్ ఫార్మేట్ లో అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇక ఈ సినిమా విడుదలకు కేవలం ప‌ది ప‌దిహేను రోజులు మాత్రమే సమయం ఉండ‌టంతో ఈలోపు ప్రమోషన్స్ లో వేగం పెంచాలి. లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో ఓపెనింగ్స్ రావడం కష్టం. శాకుంతలం లేడీ ఓరియంటెడ్ ఫిలిం. సమంతానే మెయిన్.

దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించిన అతను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న వ్యక్తి కాదు. సో ప్రమోషన్ అంటూ ఏమైనా చేస్తే అది సమంతానే చేయాలి. ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనాలి. శాకుంతలం విషయానికొచ్చేసరికి బడ్జెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ భారీ బ‌డ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. రుద్ర‌మ‌దేవి త‌రహాలో భారీగా ఖ‌ర్చు పెట్టాడ‌ని స‌మాచారం. రుద్ర‌మ‌దేవికైతే క‌నీసం గోన‌గ‌న్నారెడ్డిగా న‌టించిన అల్లు అర్జున్ అయినా ఉన్నారు. కానీ శాకుంత‌లంకి స‌మంత త‌ప్పించి మ‌రెవ్వ‌రు లేరు. ఇప్పటి నుంచైనా భారీగా ప్రమోట్ చేస్తేనే ఈ మూవీకి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో సింపతి కోసం థియేటర్లకు వస్తారు. అందుకే మేకర్స్ ఎలాగైనా స‌మంత‌ను ప్రమోషన్స్ కోసం వారి స్థాయిలో వాడేయ్యాలని భావిస్తున్నారు.

అదే సమయంలో ఆమె అనారోగ్యం రీత్యా ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని అభిప్రాయం లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ ప్రమోషన్స్ కు సమంతా వైపు నుంచి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు శాకుంతల మొత్తం సమంత చేతిలో ఉంది. ఈ చిత్రాన్నిగట్టెక్కించాల్సిన బాధ్య‌త ఆమె మీద‌నే ఉంది. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ రావాలన్నా, బ‌జ్ క్రియేట్ కావాలన్నా అది కేవలం సుమంత‌ వల్లనే సాధ్యమవుతుంది. ఆమె చేతులెత్తేస్తే మాత్రం పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .