Read more!

English | Telugu

స్పై తో నిఖిల్ ఆకట్టుకుంటాడా?!

నేటితరం యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో గా నిఖిల్ పేరును చెప్పుకోవాలి. ఈ యంగ్ హీరో స్వామి రారా చిత్రం నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు,  గత ఏడాది ఆయన నటించిన కార్తికేయ 2 చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయగా నార్త్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. డివోషనల్ టచ్ ఉన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఉత్తరాదిన లాభాల వర్షం కురిసింది. పది రూపాయలు పెట్టుబడికి వంద రూపాయలు ఆదాయం వచ్చింది. ఆ వెంటనే ఆయన 18 పేజెస్  సినిమాతో మరో  ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేశారు.  

ఈ చిత్రం కూడా బాగానే ఆడింది. ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్లో రిలీజ్ చేయమని చాలామంది కోరారు. కానీ ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాత్రమే తీసిందని నిఖిల్ తేల్చేశారు.  తాజాగా నిఖిల్ నటించబోయే కార్తికేయ 3, స్పై చిత్రాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు.  ఇక తాజాగా నిఖిల్ స్పై నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. నిఖిల్ అఫీషియల్ గా ఈ పోస్ట‌ర్ ని పోస్ట‌ర్ ని రిలీజ్  చేశారు. ఈ పోస్ట‌ర్ లో  నిఖిల్ లుక్స్ బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిఖిల్ గన్ను పట్టుకొని సీరియస్ లుక్ లో ఉన్నారు.  

ఈ పోస్టర్ తో పాటు నిఖిల్.... కార్తికేయ 2తరువాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్న. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్. ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.... అంటూ పోస్ట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ మొత్తం అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతూ సినిమా బ్లాక్ బస్టర్ అని నిఖిల్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. నిఖిల్ ప్రస్తుతం స్పై సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.  ఆ తరువాత కార్తికేయ 3 మీద ఫోకస్ పెట్టమన్నారు.