English | Telugu

దర్శకుడు వి.ఆర్.ప్రతాప్ దుర్మరణం

దర్శకుడు వి. ఆర్. ప్రతాప్ (53 ) సోమవారం రాత్రి కేన్సర్ వ్యాధితో కన్నుమూశారు. 'నువ్వు వస్తావని', 'నిన్ను చూడాలని', 'నాలో ఉన్న ప్రేమ', 'స్వామి', 'గోరింటాకు' తదితర చిత్రాలకు వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించారు. 'గోరింటాకు' వంటి హిట్ ఫిల్మ్ తీసిన తర్వాత కూడా ఆయన కెరీర్ ఎందుకు స్తబ్దుగా వుందో అర్ధం కాదు. కోడి రామకృష్ణ శిష్యుడైన ప్రతాప్ ఎప్పుడూ లో- ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. ఏ రోజునా పబ్లిసిటి కోసం పాకులాడ లేదు.

యంగ్ టైగర్ యన్ టి ఆర్ తొలి చిత్రం "నిన్నుచూడాలని" సినిమాకి దర్శకత్వం వహించి ఒక మంచి హీరోని తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రతాప్ చనిపోవటం దురదృష్టకరం. ప్రతాప్ కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తెలుగు సినిమా రంగం ఓ మంచి దర్శకుడిని పోగొట్టుకుంది. తెలుగు వన్ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలను ఆ భగవంతుని ప్రార్థిస్తూంది.