English | Telugu

త్వరలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

త్వరలో "శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" అనే భక్తిరస పౌరాణిక చిత్రం ప్రారంభంకాబోతూంది. వివరాల్లోకి వెళితే తేజస్విని సాయి ఫిలింస్ పతాకంపై, ఆకాంక్షసాయి సమర్పణలో, పి.వేణు గోపాల్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కె.రవికుమార్ చౌదరి నిర్మిస్తున్న భక్తిరస పౌరాణిక చిత్రం "శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి". ఈ "శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" పౌరాణిక చిత్రంలో సర్ప, కుజ దోషాలకు అధిపతి అయిన "శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" జీవిత చరిత్రను సర్వాంగ సుందరంగా, ఈ చిత్రం ద్వారా వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారు.

ప్రస్తుతం నరేన్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ లో ఉన్న ఈ "శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" చిత్రం అతి త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. పలువురు తెలుగు ప్రముఖ నటీనటులు నటించబోయే ఈ చిత్రంలో బేబీ ఆకాంక్ష సాయి బాల కార్తికేయుడిగా నటిస్తూంది. ఈ చిత్రానికి కెమెరా బి.రామ్ కుమార్ నిర్వహిస్తూండగా, ఆర్ట్ శిష్లా, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావు నిర్వహిస్తున్నారు. "శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" చిత్రానికి మాటలు రమణ వ్రాస్తూండగా, పాటలను పెల్లూరి బాలచందర్, సురేష్ గంగుల వ్రాస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.