English | Telugu
ప్రభాస్ ఫాన్స్ తనని చంపేస్తామని బెదిరిస్తున్నారంటున్న డైరెక్టర్!
Updated : Sep 27, 2023
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఎంతో సున్నితమైన పాయింట్ ని తన కథా వస్తువుగా ఎంచుకొని ఎంతో డేర్ గా వివేక్ తన సినిమాలని తెరకెక్కిస్తుంటాడు. ఎవరి నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చిన వాటిని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా తన స్టయిల్లో సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళుతుంటాడు. లేటెస్టుగా ది వ్యాక్సిన్ వార్ అనే ఇంకో వివాదాస్పద సబ్జెక్టు ని ఎంచుకొని ఈ నెల 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక హీరో ఫాన్స్ తనని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వివేక్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
వివేక్ అగ్నిహోత్రి సినిమాలో కథే హీరో. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీలో కాశ్మీరీ పండిట్ లని కొంత మంది ముస్లిం ఉగ్రవాదులు ఎలా ఊచకోత కోసి చంపారు అనే డేరింగ్ పాయింట్ తో యావత్తు భారతదేశం మొత్తాన్నితన వైపు చూసేలా చేసుకున్నాడు. అలాగే రేపు ది వ్యాక్సిన్ వార్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా కరోనా సమయంలో వ్యాక్సిన్ ఎలా తయారు అయ్యింది, అసలు కరోనా వాక్సిన్ తయారీ వెనుక ఏమైనా ఉందా అనే పాయింట్ తో వాక్సిన్ వార్ మూవీ ఉండబోతుందనేది బాలీవుడ్ లో వచ్చిన టాక్. ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో వాక్సిన్ వార్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇంక అసలు విషయానికి వస్తే వివేక్ గతంలో ఒకసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ప్రభాస్ కి యాక్టింగ్ రాదని ,సలార్ టీజర్ చెత్త ల ఉందని అనడంతో పాటు సలార్ కి పోటీగా తన వ్యాక్సిన్ వార్ మూవీని రిలీజ్ చేస్తానని కూడా అన్నాడు. దీంతో ప్రభాస్ ఫాన్స్ కి ఎక్కడలేని కోపం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా వివేక్ మీద విమర్శల వర్షాన్ని కురిపించారు. కొంత మంది అయితే ఇంకో అడుగు ముందుకేసి వివేక్ ని చంపేస్తామని అనడం తో పాటు వివేక్ కూతురు గురించి కూడా చాలా అసభ్యకరంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారని వివేక్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చాలా బాధ పడుతూ చెప్పుకొచ్చాడు. వివేక్ ఇంటర్వ్యూ ని చూసిన ప్రభాస్ ఫాన్స్ అండ్ నెటిజన్స్ మాత్రం అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకని పోస్ట్ లు పెడుతున్నారు .ఇంక చివరిగా చెప్పుకుంటే ప్రభాస్ ని చులకన చేస్తూ నేనెప్పుడూ మాట్లాడలేదని వివేక్ అగ్ని హోతి చెప్పటం అసలు కొసమెరుపు.