English | Telugu

అనుదీప్ ఫ్రెండ్ 'మ్యాడ్'.. మరో 'జాతిరత్నాలు' అవుతుందా!

లాజిక్స్ ని పక్కనపెట్టి నవ్వించడమే టార్గెట్ గా తీసిన 'జాతిరత్నాలు' సినిమాలో 2021 మార్చ్ లో విడుదలై ఘన విజయం సాధించింది. అప్పుడు ఈ చిత్ర దర్శకుడు అనుదీప్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అనుదీప్ బాటలోనే అతని ఫ్రెండ్ పయనిస్తున్నాడు. తమ సినిమా చూసి 'మ్యాడ్' అయిపోతారు అంటున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాలో దర్శకుడు అనుదీప్ కూడా నటించడం విశేషం. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. "దర్శకుడు కళ్యాణ్ నాకు పదేళ్లుగా స్నేహితుడు. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్ తో ఉంటుంది." అన్నారు.

అనుదీప్ మాట్లాడిన సమయంలో మైక్ అందుకున్న నిర్మాత నాగవంశీ "మీరు సినిమా చూశారు కదా. మ్యాడ్, జాతిరత్నాలు.. ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బాగుంది" అని అడగగా.. "మ్యాడ్ సినిమానే ఎక్కువ బాగుంది. నాకు బాగా నచ్చింది" అని అనుదీప్ సమాధానం ఇచ్చాడు.

అనంతరం నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. జాతిరత్నాలు తరహాలోనే కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు" అన్నాడు.

చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. వంశీ గారు చెప్పినట్టు మీకు డబ్బులు వెనక్కి రావు. అంతలా ఎంజాయ్ చేస్తారు" అన్నాడు.

మరి వీరి నమ్మకం నిజమై 'మ్యాడ్' సినిమా మరో 'జాతిరత్నాలు' అవుతుందేమో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.