English | Telugu
విజయ్, పరశురామ్ మూవీ లేటెస్ట్ అప్డేట్.. టైటిల్ ఏంటో తెలుసా?
Updated : Sep 27, 2023
విజయ్ దేవరకొండ తన 13వ సినిమాని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం అనుమానమేనని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పందించారు. సంక్రాంతి బరిలో దిగుతున్నామని చెప్పడమే కాకుండా, మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
'VD13' సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తాజాగా మేకర్స్ తెలిపారు. ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతికి రాబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ సినిమాకి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిందని, సంక్రాంతికి రావడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. అంటే ఇంకా విడుదల తేదీకి మూడు నెలలే సమయముంది. మరి ఈ మూడు నెలల్లో మిగతా సగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని నిజంగానే సంక్రాంతికే విడుదలవుతుందేమో చూడాలి.