English | Telugu
హీరోగా విజయ్ సేతుపతి కొడుకు సూర్య!
Updated : Jun 16, 2023
తమిళ సినిమా ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి, ఇవాళ హీరోగా, విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, ప్యాన్ ఇండియా రేంజ్‌లో డిమాండ్ ఉన్న నటుడిగా ఎదిగారు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆయన చేతినిండా ఎగ్జయిటింగ్ ప్రాజెక్టులున్నాయి. హిందీ, తమిళ్, మలయాళం, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. ఆయన భార్య జెస్సీ. వీరికి సూర్య, శ్రీజ అని ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరు నానుమ్ రౌడీదాన్, ముగిళ్ అనే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. సూర్యకి మొదటి నుంచీ నటన అంటే ఇష్టం ఎక్కువ. అందుకే అలా ట్రైన్ అవుతున్నారు. వెట్రిమారన్ విడుదలై2లోనూ సూర్య కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. సూరి, భవానీ శ్రీ జంటగా నటిస్తున్నారు.
దీంతో పాటు నడు సెంటర్ అనే వెబ్ సీరీస్‌లో మెయిన్ రోల్ చేస్తున్నారు సూర్య సేతుపతి. డిస్నీ హాట్‌స్టార్ దీన్ని నిర్మిస్తోంది. ఈ విషయాలన్నీ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. వీటితో పాటు ఫ్రెష్ ముస్టాచ్‌తో సూర్య, విజయ్ సేతుపతి ఇచ్చిన పోజు తెగ వైరల్ అవుతోంది. కళరి, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్సుల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారు సూర్య సేతుపతి. విజయ్ సేతుపతి ఓ వైపు కొడుకు కెరీర్ చూసుకుంటూనే, తన కెరీర్‌లోనూ యమా బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఆయన హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్‌గా మెర్రీ క్రిస్మస్, షారుఖ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా జవాన్ తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు గాంధి టాకీస్, ఆల్రెడీ రిలీజ్ అయి సక్సెస్ అయిన విడుదలకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న విడుదలై2, మహారాజా, కమల్ - హెచ్.వినోద్ మూవీస్‌తో హెక్టిక్‌గా ఉన్నారు మిస్టర్ సేతుపతి.