English | Telugu

'ఆదిపురుష్' ఫస్టాఫ్ అదిరింది!

'ఆదిపురుష్' రూపంలో అతి పెద్ద సినిమా పండుగ వచ్చేసింది. రామ కథను మరోసారి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' నేడు(జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పూర్తయ్యాయి. సినిమాకి మంచి టాకే వస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోయింది అంటున్నారు.

రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చినా, రామాయణంపై మరో కొత్త సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. పైగా ఈ తరానికి రామ కథను తెలియజేయడం కోసం ప్రభాస్ వంటి స్టార్ ని ఎంచుకోవడంలోనే మేకర్స్ సగం విజయం సాధించారు. మొదట్లో పాత్రల వేషధారణ, వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు వచ్చినా.. అవేవీ ప్రేక్షకులను థియేటర్ల దగ్గరకు రాకుండా ఆపలేకపోయాయి. ఈ చిత్రానికి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వస్తున్నాయి. టాక్ కూడా పరవాలేదు అన్నట్టుగా ఉంది. ఇప్పటికే సినిమా చూసిన వారిలో దాదాపు అందరూ ఫస్టాఫ్ అమోఘం అంటున్నారు. డ్రామా బాగా పడిందని చెబుతున్నారు. సెకండాఫ్ కాస్త డల్ అయినప్పటికీ ఓవరాల్ గా సినిమా బాగానే ఉంది అంటున్నారు. అయితే రావణాసుర పాత్ర చిత్రీకరణ, యాక్షన్ సన్నివేశాల వీఎఫ్ఎక్స్ గురించి మాత్రం నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రాముడిగా ప్రభాస్ అద్భుతంగా ఉన్నాడని, అలాగే సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా బలంగా నిలిచిందని చెబుతున్నారు. మొత్తానికి ఈ తరానికి రామ కథను తెలియజేయాలనే ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.