English | Telugu
జన నాయగన్.. రీమేక్ కాదు.. నమ్మరేంట్రా బాబు..!
Updated : Jan 4, 2026
పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ పొంగల్ కానుకగా జనవరి 9న విడుదలవుతోంది.
ఈ మూవీ నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని మొదటి నుంచి ప్రచారం ఉంది. అయితే 'జన నాయగన్' మూవీ టీమ్ మాత్రం.. ఇది రీమేక్ కాదని, విజయ్ ఒరిజినల్ ఫిల్మ్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఇది రీమేకో కాదో క్లారిటీ వచ్చింది. (Jana Nayagan Trailer)
'భగవంత్ కేసరి' చూసిన ప్రతి ఒక్కరికీ.. దాని రీమేక్ గానే 'జన నాయగన్' తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. 'భగవంత్ కేసరి' కాన్సెప్ట్ ని తీసుకోవడమే కాకుండా, చాలావరకు సీన్ టు సీన్ దింపేశారు కూడా. అయితే కాస్త స్పాన్ పెంచేసి, అలాగే విజయ్ పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా కొన్ని ఎపిసోడ్స్ యాడ్ చేశారని తెలుస్తోంది.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. 'జన నాయగన్' సినిమాని తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగు ఆడియన్స్ ట్రైలర్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "మా సినిమాని రీమేక్ చేసి మళ్ళీ మా మీదకే వదులుతున్నారా?", "ఫస్ట్ హాఫ్ భగవంత్ కేసరి, సెకండ్ హాఫ్ లెజెండ్", "ఇది రీమేక్ కాదు.. నమ్మరేంట్రా బాబు" అంటూ పలు కామెంట్స్ దర్శనమిస్తున్నాయి.
ఇక తమిళ ఆడియన్స్ కూడా ఒక విషయంలో 'జన నాయగన్' ట్రైలర్ ను ట్రోల్ చేస్తున్నారు. విజయ్ తుపాకీ పట్టుకొని ఉన్న ఒక ఫ్రేమ్ లో జెమిని ఏఐ లోగో కనిపించింది. దీంతో స్టార్ హీరో సినిమా, వందల కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏదో షార్ట్ ఫిల్మ్ లా ఆ లోగో ఏంటి అని ఫైర్ అవుతున్నారు.