English | Telugu
రాధిక.. హ్యాట్రిక్ కొడుతుందా!?
Updated : Aug 29, 2023
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. మొదటి సినిమాలోనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి మురిపించింది. అయితే, సినిమా నిరాశపరచడంతో.. సెకండ్ ఆఫర్ కి కాస్త టైమ్ పట్టింది. గల్లీ రౌడీ రూపంలో రెండో ఛాన్స్ వచ్చింది. ఇది కూడా బాక్సాఫీస్ ముంగిట తుస్సుమంది. అయితే, కీలక పాత్రలో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓకే అనిపించుకుంది.
సరిగ్గా ఇదే టైమ్ లో వచ్చిన డీజే టిల్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. రాధిక పాత్రలో ఒదిగిపోయిన నేహా.. కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకుంది. ఫలితంగానే బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. వీటిలో బెదురులంక తాజాగా తెరపైకి వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినా.. కమర్షియల్ గా ఈ సినిమా బాగానే వర్కవుట్ అయింది. దీంతో.. డీజే టిల్లు, బెదురులంక రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కాయి నేహాకి. మరి.. త్వరలోనే రానున్న రూల్స్ రంజన్ తో ఈ ముద్దుగుమ్మ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.