English | Telugu

"మాగ్జిమ్ ఫొటో నాది కాదు"- విద్యాబాలన్

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సెక్సీ ఫొటో ఒకటి మాగ్జిమ్ పత్రిక ముఖ చిత్రంగా ప్రచురించింది. ఈ పత్రిక ముఖ చిత్రం మీద ఉన్న ఫొటో తనది కాదనీ, తాను అలాంటి ఫోటో సెషన్ ఎన్నడూ చేయలేదనీ, అలాటి డ్రెస్ లతో అస్సలు చేయలేదనీ విద్యాబాలన్ చెపుతోంది.ఈ పత్రిక గతంలో సోనాక్షి సిన్హా ఫొటోని కూడా విద్యాబాలన్ ఫొటోలాగే ముఖ చిత్రంగా ఇలాంటిదే ప్రచురించింది. విద్యాబాలన్ తనముఖంతో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన ఫొటోని తమ పత్రిక ముఖ చిత్రంగా వేసినందుకు మాగ్జిమ్ పత్రిక మీద పరువునష్టం దావా వేస్తానని విద్యాబాలన్ అంటోంది.

ఇదంతా నిజమేనంటారా...? లేకపోతే విద్యాబాలనే అలాంటి ఫొటోని మాగ్జిమ్ పత్రికకిచ్చి పైకి ఇలాంటి కబుర్లు చెపుతుందంటారా...? మంచి కానీ చెడు కానీ దారెటువంటిదైనా ఆ ఫొటో పుణ్యమాని నటి విద్యాబాలన్ కు మాత్రం బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. ఈ విధంగా విద్యాబాలన్ మాగ్జిమ్ పత్రిక ద్వారా మరికొంతమంది నటీమణులకి పబ్లిసిటీ సంపాదించుకోవటంలో ఆదర్శప్రాయంగా నిలిచింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.