English | Telugu

"తను వెడ్స్ మను" లో సాయిరాం, ఛార్మి

సాయిరాం, ఛార్మి కలసి ఒక తెలుగులోకి రీమేక్ చేయబోతున్న చిత్రంలో నటించటానికి సిద్ధపడుతున్నారు. కంగనా రనౌత్ ‍, మాధవన్ కలసి నటించగా బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన "తను వెడ్స్ మను" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రీమేక్ చిత్రంలో హీరోగా సాయిరాం శంకర్, హీరోయిన్ గా ఛార్మి నటించబోతున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులను నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సొంతం చేసుకున్నారు.

చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, దిల్ రాజు కలసి నిర్మిస్తారట. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు గోపి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఛార్మి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో నటిస్తుంది. ఆ కారణంగానే పురీ జగన్నాథ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.