English | Telugu

నేను కారణజన్మురాలిని.. అనసూయ కీలక వ్యాఖ్యలు 

-ఏంటి అనసూయ కి అంత నమ్మకం
-ఆమె నిజంగానే కారణ జన్మరులా
-అయితే ఈ జన్మలో ఏం చేయబోతుంది!

యాంకర్ గా, నటిగా, సామాజిక సమస్యలపై స్పందించే భాద్యత గల పౌరురాలిగా అనసూయ(Anasuya)పోషిస్తున్న పాత్ర ఎంతో ఘనమైనది. భారీ అభిమాన ఘనం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటు ఎంతో డేర్ గా పలు విషయాలపై తన భావాన్ని చాలా బలంగా చెప్పడం కూడా అనసూయ స్పెషాలిటీ. రీసెంట్ గా ఇనిస్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వాళ్ళు వేసిన పలు ప్రశ్నలకి తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చి థట్ ఈజ్ అనసూయ అని మరో సారి తెలిసేలా చేసింది.

అనసూయ అభిమానులతో మాట్లాడుతు'నేనెప్పుడూ ఏదైనా విషయంపై నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తాను. కానీ ఆ అభిప్రాయాన్ని వివాదం చేస్తారు. నేను ఫెమిస్ట్ నే కానీ పురుషుల వ్యతిరేకిని కాదు. ఈ మధ్యన చీరలు కడుతుంటే ట్రోల్స్ కారణంగా చీరలు కడుతున్నానని కొంత మంది అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. నాకెప్పుడూ ఇష్టముంటే అప్పుడు చీరలు కట్టుకుంటాను.


Also read:సంక్రాంతి సినిమా ఎంత పని చేసింది! పగోడికి కూడా ఈ బాధ రాకూడదు

నాకు సంబంధం లేని విషయాల్లో కలగచేసుకుని పరువు పోగొట్టుకుంటున్నానని చాలా మంది అనుకుంటున్నారు. నా పరువు పోలేదు. నా దగ్గరే ఉంది. నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను. ఇది డెస్టినీ. కారణ జన్మురాలినని నా నమ్మకం అని చెప్పుకొచ్చింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.