English | Telugu

సంక్రాంతి సినిమా ఎంత పని చేసింది!  పగోడికి కూడా ఈ బాధ రాకూడదు


-సినీ విశ్లేషకులు ఏమంటున్నారు
-తెలుగు ప్రేక్షకుల పరిస్థితి ఏంటి
-అసలు ఏం చేద్దామనుకుంటున్నారు
-ఆ ఆరు చిత్రాల ద్వారా ఏం అర్ధమవుతుంది


పగవాడికి కూడా మీ బాధ రాకూడదు గురువు గారు అని అదుర్స్ మూవీలో బ్రహ్మానందాన్ని ఉద్దేశించి ఎన్టీఆర్(Ntr)చెప్తాడు. ఇప్పుడు అదే డైలాగ్ ని తెలుగుసినిమా ప్రేక్షకులని ఉద్దేశించి చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే రేపట్నుంచి వాళ్ల ముందుకి దిరాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు,భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, పరాశక్తి వంటి ఆరు సినిమాలు వస్తున్నాయి. నిజానికైతే ఈ ఆరు చిత్రాల రాకతో తెలుగు ప్రేక్షకుల కంటే అదృష్టవంతులు ఉండరు. కానీ సోషల్ మీడియా వేదికగా ఈ ఆరు సినిమాల రాకతో సినీ విశ్లేషకుల మధ్య మరో చర్చ కూడా జరుగుతుంది. మరి ఆ చర్చ ఏంటో చూద్దాం.

సినీ విశ్లేషకులు మాట్లాడుతు సినీ మార్కెట్ లో ప్రత్యక్షం కాబోతున్న ఆరు సినిమాలు ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ . ట్రైలర్ రిలీజ్ తో ఇంకాస్త క్రేజీ ప్రాజెక్ట్స్ గా మారిపోయాయి. పైగా సదరు ఆరుగురు హీరోలకి ఫ్యాన్ బేస్ భారీగా ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో కూడా సదరు హీరోలపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆ ఆరు సినిమాలని చూస్తామా అనే ఆశతో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఆరు సినిమాలని చూడాలంటే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ ని బట్టి కొంచం భారీ అమౌంట్ నే కావాలి. పైగా ఫ్యామిలీ తో చూడాలంటే సదరు అమౌంట్ లో భారీ పెరుగుదల ఖాయం.


Also read: రాజాసాబ్ హిట్, ప్లాప్ పై డిస్ట్రిబ్యూటర్ ఆడియో లీక్.. చిరంజీవిని ఎందుకు లాగారు

నిజానికి తెలుగు సినిమాని తెలుగు సినిమా ప్రేక్షకులు తమ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. గతంలో కూడా సంక్రాంతి సందర్భంగా చాలా క్రేజీ సినిమాలే వచ్చాయి. అయినా అమౌంట్ మాటర్ నథింగ్ అంటూ క్యూ కట్టారు.కానీ ఈ సారి ఏకంగా ఒకే సారి ఆరు క్రేజీ కాస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. పైగా అప్పటి టికెట్ రేట్స్ కి ఇప్పటి టికెట్ రేట్స్ కి చాలా తేడా ఉంది. సంక్రాంతి పండుగ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వాళ్ల ముందు నోరూరే ఆరులడ్డులని పెట్టి నోరూరిస్తున్నట్టుగా ఉంది. అందుకే పగోడికి కూడా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకి వచ్చిన బాధ రాకూడదనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.