English | Telugu

వెంకటేష్ గాయం లో "ఓంకారం"

ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య విశాఖపట్టణంలో జరిగిన బాలీవుడ్ హీరోస్ వర్సెస్ సౌత్ సూపర్ స్టార్స్ 20- 20 క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. వెంకటేష్ కి ముఖం మీద కుడివైపు గడ్డం మీద తగిలిన గాయానికి కుట్లు వేసి అప్పటికి పంపించారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ గాయం చూస్తుంటే ఓంకారం గుర్తుకొస్తుంది. వెంకటేష్ కి మామూలుగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అతని గాయం కూడా ఓంకారం రూపంలో కనపడుతూండటంతో చూసే వారికి అదేదో దైవ సంకల్పంలాగ అనిపిస్తుంది.

ఆ క్రికెట్ మ్యాచ్ లో, సల్మాన్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించిన బాలీవుడ్ హీరోస్ పై, వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించిన బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం వెంకటేష్ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గాయం తగ్గగానే ఆయన తేజ దర్శకత్వంలోని "సావిత్రి' చిత్రంలోనూ, త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.