English | Telugu
ఆ డైరెక్టర్ మన శంకర వరప్రసాద్ గారుకి ప్రతిపక్షమేనా!.. అసలేం జరుగుతుంది
Updated : Jan 8, 2026
-ఎవరు ఆ డైరెక్టర్
-ప్రతిపక్షంగా మారడానికి కారణం ఏంటి
-పూర్తి వివరాలు ఇవే
మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానుల కేరింతలతో థియేటర్లు కళకళలాడటానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. డై హార్ట్ ఫ్యాన్స్ అయితే బాస్ సిల్వర్ స్క్రీన్ పై వేసే మొదటి అడుగుని చూడటం కోసం లక్షల రూపాయిలు పెట్టి టికెట్స్ ని కొంటున్నారు. అత్యధిక టికెట్ రేట్ ఇప్పటి వరకు ఆరు లక్షల రూపాయల దాకా అంటే మన శంకర వరప్రసాద్ గారు క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా మన శంకర వర ప్రసాద్ గారు రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
ఇక నిన్న హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళావేదికగా మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి గురించి చిరంజీవి మాట్లాడుతు అనిల్ తో సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ . షూటింగ్ లో అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేసాడు. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదాగా జరిగింది. షూటింగ్ ఆఖరి రోజున చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను.ఇక అనిల్ సినిమాని ఎంతగానో ప్రేమిస్తాడు.
Also read: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ పై రెస్పాన్స్ ఇదే
షూటింగ్ కంప్లీట్ అయ్యాక సినిమా మొత్తాన్ని చూసుకొని, పలానా సీన్ ఎందుకు ఉండాలి. దీని వల్ల ఉపయోగం ఏంటి అని తన సినిమాకి తానే ప్రతిపక్షంగా మారిపోయి అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తొలగించేస్తాడని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.