English | Telugu

ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదు.. కుమారస్వామిగా మరో హీరో!

త్రివిక్రమ్ కు బిగ్ షాక్
'గాడ్ ఆఫ్ వార్' కథతో మరో భారీ ప్రాజెక్ట్
కుమారస్వామి పాత్రలో ఆ స్టార్ హీరో?
ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఏం చేయనున్నారు?

'గాడ్ ఆఫ్ వార్' కుమారస్వామి కథ ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కుమారస్వామిగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడా? అల్లు అర్జున్ నటిస్తాడా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే వీరికంటే ముందు కుమారస్వామిగా మరో హీరో నటించే అవకాశం కనిపిస్తోంది. (God of War)

కుమారస్వామి కథతో తానొక భారీ ప్రాజెక్ట్ ని చేయనున్న విషయాన్ని తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల రివీల్ చేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు కిషోర్ తిరుమల.

నాలుగేళ్ళ క్రితమే కుమారస్వామి కథ ఆధారంగా 'గౌరీ తనయ' పేరుతో మైథలాజికల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశానని, అన్నీ కుదిరితే త్వరలోనే భారీస్థాయిలో తెరపైకి తీసుకొస్తానని కిషోర్ తిరుమల తెలిపారు.

'గౌరీ తనయ' కథను కిషోర్ ఇప్పటికే హీరో నానికి వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి నాని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం 'ది ప్యారడైజ్'తో బిజీగా ఉన్న నాని.. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఇదేననే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే.. త్రివిక్రమ్ కి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. ఆయనకు పురాణాలపై ఎంతో పట్టుంది. అందుకే తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పెద్దగా ఎవరూ టచ్ చేయని కుమారస్వామి కథతో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఊహించనివిధంగా ఇదే కథతో బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని, త్వరలోనే సినిమా చేస్తానని కిషోర్ తిరుమల ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్నా ముందు కిషోర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కినా ఆశ్చర్యంలేదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.