English | Telugu
కామెడీ చేయడం చాలా కొత్తగా ఉందంటున్న తాప్సీ
Updated : Feb 21, 2023
ఈ ఏడాది చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోందని అంటున్నారు తాప్సీ పన్ను. ఇప్పటిదాకా చేసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్నది మాత్రం నెక్స్ట్ లెవల్ అంటున్నారు మిస్ పన్ను. అంతే కాదు, తాను ఇప్పటిదాకా ట్రై చేయని జోనర్‌ని టచ్ చేస్తున్నారు. అది కూడా ఒకటి కాదు, రెండింటితో... వో లడ్కి హై కహా, డంకీ సినిమాల్లో ఆమె సరికొత్త అవతార్‌లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇప్పటిదాకా తాప్సీ పన్ను కామెడీ జానర్‌ని ఎప్పుడూ ట్రై చేయలేదు.
దీని గురించి తాప్సీ మాట్లాడుతూ ``కామెడీ చేయడం అనేది నాకు సరికొత్త ఎక్స్ పీరియన్స్. వో లడ్కీ హై కహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ కేరక్టర్ చేస్తున్నాను. నేను కెమెరా ముందు చెప్పిన జోకులకు సెట్లో ఉన్నవారందరూ పగలబడి నవ్వారు. థియేటర్లలోనూ అలాగే స్పందన వస్తుందని ఆశిస్తున్నాను. సెట్లో నా మీద జోకులు పేల్చినప్పుడు నవ్వకుండా ఆపుకోగలగడం చాలా కష్టంగా అనిపించింది. అసలు అక్కడేమీ జరగనట్టు, మనల్ని ఎవరూ ఏమీ అననట్టు, అర్థం కానట్టు ముఖం పెట్టి నిలుచోవడం చాలా కష్టం. థియేటర్లో నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలోనే కాదు, డంకీలోనూ సేమ్ ఇలాంటి కేరక్టరే చేశాను. ఆడియన్స్ నవ్వి నవ్వి కడుపుబ్బి పోయిందని అంటారు`` అని అన్నారు.
వో లడ్కీ హై కహాలో ప్రతీక్ గాంధీ, ప్రతీక్ బబ్బర్ కీ రోల్స్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ డంకీలో షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తున్నారు. హసీనా దిల్‌రుబా సినిమాకు సీక్వెల్‌గా ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా అనే సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. హసీనా దిల్‌రుబాలో విక్రాంత్ , హర్షవర్ధన్ రానే కలిసి నటించారు. ఇప్పటిదాకా నార్త్ లో మినీ ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉంది తాప్సీ పన్నుకి. యాక్షన్ సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ, తనకంటూ స్పెషాలిటీని సంపాదించుకున్న తాప్సీకి ఈ ఏడాది చాలా క్రూషియల్. డంకీ విజయవంతమైతే, నార్త్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలను దక్కించుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.