English | Telugu
‘బింబిసార’ దర్శకునితో రామ్‌చరణ్!
Updated : Feb 21, 2023
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఆయన మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టే క్రేజీ ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ది గ్రేట్ శంకర్ దర్శకత్వంలో ఆర్ సి 15 అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవలే హైదరాబాద్ చార్మినార్, కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక దీని తర్వాత రామ్ చరణ్ ఆర్ సి 16 గా బుచ్చిబాబుతో ఓ చిత్రం చేస్తారని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. ఈ మూవీ ని మొదట ఎన్టీఆర్ కు వినిపించడం ఆయన ఓకే చేయడం జరిగిపోయాయి. కానీ ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రం ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టు రామ్ చరణ్ వద్దకు చేరింది.
బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ చరణ్ కు నచ్చింది. ఆ మేరకు ప్రకటన కూడా విడుదలైంది. కానీ అది ఆర్సి 16 ఆర్సి 17 అనేది మాత్రమే ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీంతో శంకర్ తర్వాత చరణ్ చేయబోయే ఆర్సి 16 సినిమా ఎవరితో అనే కన్ఫ్యూజన్ ఒకటి బయటకు వచ్చింది. బుచ్చిబాబు సనా తో కాకుండా ఆర్సీ16 ని మరో దర్శకునితో చేయడానికి రామ్ చరణ్ ముందుకు వచ్చాడని సమాచారం. ముందుగా తను కమిట్ అయిన యు వీ క్రియేషన్స్ వారికి ఆర్సీ 16 చేయనున్నారని సమాచారం. యూవి వారు ఈ మధ్య చరణ్ గౌతమ్ తిననూరి కాంబినేషన్లో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. కానీ అది అనేక కారణాల వల్ల ఆగిపోయింది. ఆ స్థానంలో కొత్త దర్శకుడు మల్లిది వశిష్ట దర్శకత్వంలో ఆర్ సి 16 ని యూ వీ క్రియేషన్స్ వారు నిర్మించాలని అనుకుంటున్నారట. రామ్ చరణ్‌ని కలిసి స్టోరీ వినిపించారని తను చెప్పిన స్టోరీ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ చేశాడని సమాచారం. వశిష్ట మల్లిడి బింబిసారా తో దర్శకునిగా పరిచయమయ్యారు.
చిత్రం సంచలన విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచి ఏకంగా 50కోట్లను వసూలు చేసింది. ఇక వశిష్ట త్వరలో బాలయ్యతో కూడా ఓ చిత్రం చేయనున్నారు. తాజాగా రామ్ చరణ్-వశిష్ట కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో బుచ్చిబాబు సానా చిత్రం మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో బుచ్చిబాబు సానాది ఆర్సీ 16 కాదు.. ఆర్సీ 17 అని అంటున్నారు. ఇదే నిజమైతే చరణ్‌తో చిత్రం చేయడానికి బుచ్చిబాబు మరింతగా వెయిట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.