English | Telugu
ప్రతీ సీన్ లో వాళ్ళని వాళ్ళు చూసుకున్నారని చెప్పిన బలగం డైరెక్టర్!
Updated : Jul 23, 2023
'బలగం' సినిమా ప్రతి కుటుంబంలోని ప్రతీ మనిషి లోని ఎమోషన్ ని బయటకు తీసిన సినిమా. కుటుంబ బంధాలకు పెద్ద పీటవేస్తూ అద్భుతమైన కథతో వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన బలగం మూవీ ఒక సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ 'బలగం' మారు మ్రోగుతోంది. మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు.
ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది. వేణు మొదటగా తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో స్టార్ చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లో వేణు వండర్స్ టీమ్ కి లీడర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన వేణు.. అనుకోని కారణాల వల్ల ఆ షోకి దూరమయ్యాడు. చాలా రోజులు తెరపై కనిపించని వేణు.. బలగం మూవీతో దర్శకుడిగా ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. బలగం సినిమా డైరెక్ట్ చేసి.. ఆ సినిమాలో తను కూడా చిన్న పాత్రని పోషించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని సంఘటనలని వివరిస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వీడియో బైట్ లని అప్లోడ్ చేస్తున్నాడు వేణు వెల్దండి. బలగం సినిమా చాలా నేర్పింది అంటూ దీనికి పనికి చేసిన యూనిట్ వాళ్ళు చెప్పారు. "యాక్టర్ ఒక్కసారి బరెస్ట్ అయ్యాక .. మళ్ళీ ఆ ఎమోషన్ రావడానికి రెండు మూడు గంటల టైం పడుతుంది. ఐలయ్య క్యారెక్టర్ వాళ్ళ నాన్న కొమరయ్య ఫోటో తీసుకొని బావురుమని ఏడుస్తాడు. ఆ తర్వాత తమ్ముడుని , చెల్లెలిని పట్టుకొని అలా ఆకాశంలోకి చూస్తూ ఏడుస్తాడు. ఇలా చేయడం నాట్ ఏ ఈజీ టాస్క్. ఏదో ఒక సిచువేషన్ లో వాళ్ళ లైఫ్ లో వాళ్ళని చూసుకున్నారు. అందుకే అంత డెప్త్ తో ఆ సీన్ చేసారు. థాంక్స్ టూ ఆల్ మై యాక్టర్స్" అని వేణు ఎల్దండి చెప్పాడు.