English | Telugu
మరో సౌత్ మూవీలో బాబీ డియోల్
Updated : Jul 23, 2023
ఇప్పుడు టాలీవుడ్ ని ఎంటైర్ ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. హాలీవుడ్ సైతం టాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో బాలీవుడ్ స్టార్స్ మన సినిమాల్లో నటించటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ ఇలా ఎందరో స్టార్స్ నటించారు. ఇప్పుడు వీరి బాటలోకి అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ వంటి స్టార్స్ వచ్చారు. బాబీ డియోల్ విషయానికి వస్తే ఈయన తొలి తెలుగు సినిమా హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కుతోంది.
హరి హర వీరమల్లు చిత్రం తర్వాత బాబీ డియోల్ మరో దక్షిణాది సినిమాలో నటించటానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ఏదో కాదు.. కంగువా. సూర్య కథానాయకుడిగా సిరుతై శివ దర్శకత్వంలో భారీగా రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ ఇది. సూర్య పుట్టినరోజు సందర్బంగా వచ్చిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేసింది. ఇందులో విలన్‌గా బాబీడియోల్ నటిస్తున్నారు. సూర్య పాత్ర ఇందులో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన పాత్రను ఢీ కొట్టాలంటే దాన్ని మించేలా విలన్ లుక్ ఉండాలి, క్యారెక్టరైజేషన్ ఉండాలి. ఎలా అని దర్శకుడు ఆలోచిస్తున్న తరుణంలో ఆయనకు బాబీ డియోల్ గుర్తుకు వచ్చారు. ఫిజికల్‌గానూ బాబీ డియోల్ బావుంటారు కనుక, తనైతే కంగువా పాత్రకు న్యాయం చేస్తారనిపించి ఆయన్ని మేకర్స్ సంప్రదించారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఆయన రోల్ ఎలా ఉంటుందనేది తెలియాంటే మాత్రం కొన్నాళ్లు ఆగ్సాల్సిందే.
సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా కంగువా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా 2డి, 3డి టెక్నాలజీతో. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుంది.