English | Telugu
అందాలతో అన్యాయం చేసిన నాని భామ
Updated : Jan 28, 2014
నాని, వాణీ కపూర్ జంటగా నటించిన "ఆహ కళ్యాణం" చిత్ర తమిళ వర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాని పంచెకట్టులో, వాణీ చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి, నిజమైన తమిళ వాసులుగా దర్శనమిచ్చారు. ఇందులో వాణీ మాత్రం తన చీరకట్టుతో అందాల ప్రదర్శన ఎక్కువగానే చేసి తమిళ తంబీలకు సెగలు పుట్టించింది. అయితే తెలుగు వర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాని అదే పంచే కట్టులో, వాణీ చీరకట్టులో విచ్చేసారు. కానీ వాణీ తన అందాలను తెలుగు వారికి మాత్రం అందకుండా జడతో కవర్ చేసుకుంది. మరి సినిమాలోనైనా ఏమైనా అందాల విందు చేస్తుందో లేదో చూడాలి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.