English | Telugu
బుద్ధిలేని సినీపెద్దల డైలాగులు
Updated : Jan 28, 2014
హాస్య నటుడిగా, విలన్ గా, సహాయ నటుడి పాత్రలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు సుధాకర్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలిసింది. 2010లో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్ళిన సుధాకర్ ను ఇప్పటిదాకా తెలుగు సినిమా పెద్దలు ఎవ్వరు పట్టించుకోలేకపోవడం నిజంగా బాధాకరం. బ్రతికున్నప్పుడు బ్రతికించుకోవడానికి ప్రయత్నించని ఈ పెద్దలు.. ఏదైనా జరగరాని ఘోరం జరిగితే మాత్రం వచ్చి పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. ఇలాంటి సినీపెద్దలు ఎవరిది వారు డబ్బాలు కొట్టుకోవడం తప్ప.. వీరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అసలు?