English | Telugu
విద్యాబాలన్ కు పద్మశ్రీ అవార్డు ఏంటి ?
Updated : Jan 27, 2014
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాలన్ కి కూడా ఈ అవార్డు వచ్చింది. ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటి, దర్శకురాలు శ్రీప్రియ తన ట్విట్టర్ ద్వారా చాలా తీవ్రంగా స్పందించారు. "సీనియర్ తారలను మర్చిపోవడం బాధాకరం. విజయ నిర్మలకు నటిగా ఎంతో గుర్తింపు ఉంది. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డ్ కూడా సాధించిన ఆమెకు ఇంకా "పద్మ" పురస్కారం రాకపోవడం ఏంటి? అలాగే నాటి తరం తారల్లో నటి లక్ష్మి కూడా భారతీయ భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన ఆమెను గుర్తించకపోవడం ఏంటి? అని ఘాటుగా స్పందించారు. కానీ ఎన్ని సినిమాలు చేసి ఉంటుందని విద్యాబాలన్ కి పద్మ పురస్కారం కట్టబెట్టారో తనకు తెలియడం లేదని శ్రీప్రియ పేర్కొన్నారు. కమల్ హాసన్ కి పద్మభూషణ్ రావడం అంటే.. ఆయనకు ఆ అర్హత ఉంది. అది ఆనందించదగ్గ విషయం అని తెలిపింది. సీనియర్ తారలకు తగిన గుర్తింపు లభించడంలేదనే బాధతో ఈ కామెంట్లు చేశానని" ఆమె స్పష్టం చేసారు. మరి శ్రీప్రియ చెప్పిన మాటలకూ ఎవరు, ఎలా స్పందిస్తారో చూడాలి.